అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. గతేడాది యానిమల్ సినిమాతో మరోసారి రికార్డులు కొల్లగొట్టాడు. ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మరో క్రేజీయెస్ట్ సినిమా స్పిరిట్. ప్రభాస్ హీరోగా రాబోతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 2024 చివరలో మొదలు కానుందని ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగా.
సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో విలన్‌గా ఎవరు కనిపించబోతున్నారనే దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ చిత్రంలో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ మడాంగ్‌సియోక్ విలన్‌గా కనిపించబోతున్నాడట. ఈ పాన్ ఆసియన్ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా ఈ సారి ఇంటర్నేషనల్ మార్కెట్‌ను కూడా షేక్ చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు తాజా అప్‌డేట్ చెప్పకనే చెబుతోంది.