‘‘జల్ జంగల్ జమీన్’’ జెండా ఎత్తిన రామ్ చరణ్, తారక్..‘ఎత్తరజెండా’ ఫుల్ వీడియో వచ్చేసింది

-

మాస్టర్ స్టోరి టెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRRను సినీ లవర్స్ విశేషంగా ఆదరిస్తున్నారు. గత నెల 25న విడుదలైన ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ నటించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ ఫుల్ వీడియోలను RRR మేకర్స్ ఒక్కొక్కటి విడుదల చేసి ఫ్యాన్స్ కు మరోసారి విజ్యువల్ ట్రీట్ ఇస్తున్నారు.

ఇప్పటికే ‘నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ’ సాంగ్స్ ఫుల్ వీడియోలను విడుదల చేశారు. తాజాగా ‘ఎత్తర జెండా’ సాంగ్ ఫుల్ వీడియో విడుదల చేశారు. వీడియోలో సీతా రామ రాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా తారక్ యాక్ట్ చేసిన లాస్ట్ సీన్ కనబడుతోంది. ‘‘యాన్ ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ ’’ అనే స్టాంప్ కూడా పడుతుండటం చూసి సినీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

RRR సినిమా లాస్ట్ సీన్ లో తనకు చదువు నేర్పించాలని భీమ్ పాత్ర ధారి తారక్ అడగగా, సీతా రామరాజు ‘‘జల్ జంగల్ జమీన్’’ అనే అక్షరాలను నేర్పిస్తాడు. అలా వారిరువురు ‘‘జల్ జంగల్ జమీన్’’ జెండా ఎత్తారు.

ఇక ‘ఎత్తర జెండా’ పాటలో దేశభక్తులను తలుచుకున్నారు. పాటలో రాజమౌళి అలా ఒక్కసారి మెరవడం చూసి సినీలవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘వందేమాతరం’ జెండా పట్టుకుని రామ్ చరణ్, తారక్, ఆలియా భట్ స్టెప్స్ వేశారు. ఈ సాంగ్ ఫుల్ వీడియోను మీరూ ఇక్కడ చూసేయండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version