గాలి సంపత్.. గాలి కంటే వేగంగా..

-

శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న గాలి సంపత్ మూవీ నెల క్రితమే మొదలయ్యింది. బ్రోచేవారెవరురా సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీ విష్ణు, తన తర్వాత చిత్రంగా గాలి సంపత్ పేరుతో రూపొందుతుంది. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందట. సినిమాలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ మేరకు చిత్రబృందం సెట్స్ లో దిగిన ఫోటోలని విడుదల చేసింది.

అనీష్ క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా శ్రీ విష్ణు కనిపిస్తున్నాడు. మాటలు రాని పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తాడట. తండ్రీ కొడుకుల మధ్య కనిపించే అనుబంధాన్ని హాస్యంతో జోడించి అందంగా తెరకెక్కిస్తున్నారట. నిర్మాత అయిన ఎస్ క్రిష్ణ ఈ సినిమాకి కథ కూడా అందిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కథనం అందిస్తున్న ఈ సినిమాకి అచ్చు సంగీతం అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version