మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్…!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సైరా సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సైరా ఫ్లాప్ తర్వాత ఈ సినిమా రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎలా అయినా సరే హిట్ కొట్టాలని చిరంజీవి పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.

ఇటీవల బయటకు వచ్చిన ఈ సినిమా లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెట్ లో ఉన్న ఎవరో వ్యక్తులు ఈ సినిమా లుక్ ని బయట పెట్టారు. ఆ లుక్ లో చిరంజీవి… మావోయిస్ట్ గా కనపడుతున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి ఈ సినిమా టైటిల్ ని ఆచార్య గా అనుకుంటున్నాం అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. ఈ ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

సామాజిక కోణం లో వస్తున్న ఈ సినిమా టైటిల్ త్వరలో ఖరారు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ని ఉగాది సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఒక పాత్రలో కనపడుతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news