హైపర్ ఆది కి లవ్ ప్రపోజ్ చేసిన యాంకర్ వర్షిణి.. షాకింగ్ పోస్ట్ వైరల్..!!

-

జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన హైపర్ ఆది ప్రస్తుతం పలు షో లలో బిజీగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో పలు పాత్రల్లో నటిస్తూ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు ఆది. ఇక జబర్దస్త్ తదితర షో లలో కావాలని వివాహాలు, లవ్ వంటి అంశాలను ఆకర్షణ కోసం చేస్తూ ఉంటారు. సుధీర్, రష్మీ మధ్య ఏదో ఉంది అంటూ కూడా పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి ఇప్పటికీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.ఇక హైపర్ ఆది తన లవ్ ఎఫైర్ల గురించి ఇంతవరకు ఎలాంటి విషయం బయటికి రాలేదు. కానీ తాజాగా హైపర్ ఆది కి వర్షిణి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అది కూడా రియల్ లైఫ్ లో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు అనే విధంగా కామెంట్లు చేసింది. అందుకు కారణం వర్షిణి లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా హైపర్ ఆది ఇటీవలే తన జన్మదిన వేడుకలు జరిగాయి హైపర్ ఆది తన బర్తడే వర్షిణి తో పర్సనల్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు.

ఈ వీడియోని వర్షిణి పోస్ట్ చేయడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఈ వీడియోలో వర్షిణి ఆదికి కేక్ తినిపించడం.. అతడిని ప్రేమగా కౌగిలించుకోవడం రొమాంటిక్ గా చేసింది.. ఇదంతా చూస్తుంటే వర్షిణి ఆది కి ప్రపోజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వర్షిణి ఈ వీడియో కి కామెంట్ పెడుతూ డియర్ ఆది.. హ్యాపీ బర్తడే నా జీవితం మొత్తం నువ్వు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఆది నువ్వు నాకు రైట్ కదరా ఆది అంటూ లవ్ ఏమో జిలాను పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్షిప్ లో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version