డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో డీల్ కుదుర్చుకున్న హన్సిక..!

-

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక మోత్వాని గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఇకపోతే ఈమె తన స్నేహితురాలి భర్త అయిన ప్రముఖ బిజినెస్ పార్టనర్ సోహైల్ కతురియా తో తన జీవితాన్ని పంచుకోబోతోంది. తన పెళ్లి వార్త బయటకు రాగానే హన్సిక మీద నెగటివ్ థాట్స్ బాగా ఎక్కువయ్యాయి. తను పెళ్లి చేసుకునే వ్యక్తికి ఆల్రెడీ వివాహమైందని.. అతని పెళ్లికి కూడా హన్సిక వెళ్ళిందని మీడియా పెద్ద ఎత్తున హడావిడి చేసింది. అంతేకాదు తన ఫ్రెండ్ భర్తనే హన్సిక మళ్లీ వివాహం చేసుకుంటుందని, ఒక న్యూస్ హాట్ టాపిక్ గా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే హన్సిక పెళ్లిపై ఈ న్యూసేన్స్ కి కారణం తమిళ స్టార్ హీరో ఫ్యాన్స్ అని కూడా అంటున్నారు.

గత కొద్దిరోజుల నుంచి అతడితో లవ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.. ఇకపోతే హన్సికతోనే కాదు కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ తో కూడా ఇతడు ప్రేమాయణం నడిపినట్లు వార్తలు బాగా వినిపించాయి. అయితే ఆమె దూరం అయ్యాక కొన్నాళ్ళు ఖాళీగా ఉండి మళ్ళీ హన్సికతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడు. అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవ్వడంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది హన్సిక. ఏకంగా తన పెళ్లి వీడియోని ఒక ఓటీటీ కి అమ్మేసింది హన్సిక. ఇదిలా ఉండగా ఇదివరకు నయనతార కూడా తన మ్యారేజ్ వీడియో రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసింది. డాక్యుమెంటరీ లాగా నయనతార – విగ్నేష్ ల పెళ్లి వీడియో రాబోతోందని , దానికోసం భారీ మొత్తంలో నయనతార అందుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని హన్సిక ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.

డిసెంబర్ 4వ తేదీన హన్సిక సోహైల్ ల పెళ్లి జరగనుంది. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి వీడియోను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనేసిందట. అతి కొద్దిమంది అతిధుల సమక్షంలోనే ఈ మ్యారేజ్ జరగబోతుందని తెలుస్తోంది. హన్సిక కొంచెం భిన్నంగా ఆలోచించి తన పెళ్లి వీడియోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news