తమిళ స్టార్ హీరో అజిత్ కు ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ లో రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు అదుపు తప్పి సైడ్ వాల్ ను బలంగా ఢీ కొట్టింది. సుమారు 180 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లిన హీరో రేసింగ్ కారు సైడ్ వాల్ ను ఢీ కొట్టి కుదుపునకు లోనైంది. ఈ ఘటనలో అజిత్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప గాయాలతో అజిత్ బయటపడ్డాడు.
అజిత్ కారుకు ప్రమాదం జరిగిందనే వార్త క్షణాల్లోనే వైరల్ అయింది. దీంతో అజిత్ అభిమానుల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలు కావడంతో అభిమానులు, హీరో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రాబోయే రేసింగ్ ఛాంపియన్ షిప్ కు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అన్ని జాగ్రత్తలు పాటించడంతో అజిత్ కి జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం పై హీరో అజిత్ లేదా ఆయన టీమ్ అధికారికంగా మాత్రం స్పందించలేదు.