ఓ సినిమాకి హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అనంతరం తప్పుకోవడం సినీ ఇండస్ట్రీలో కామన్ గా వినిపించే పదం. దానికి హీరోయిన్లు అతీతం కాదు. ఇటీవల ప్రాజెక్ట్ కి సైన్ చేసి మధ్యలోనే డ్రాప్ అయిన బ్యూటీస్ చాలా చాలా మందే ఉన్నారు.
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారత్ చిత్రానికి మొదట ప్రియాంక చోప్రా సైన్ చేసింది. హాలీవుడ్ ప్రాజెక్ట్, నిక్ జోనాస్‌తో పెళ్ళి కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే డ్రాప్ అయ్యింది. ఆ స్థానంలో కత్రినా కైఫ్‌ని ఎంపిక చేశారు. తెలుగులో మోస్ట్ ప్రిస్టీజియస్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఇందులో ఎన్టీఆర్ సరసన మొదట బ్రిటీష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ సైన్ చేశారు. ఆమె కూడా అర్థాంతరంగా ఈ భారీ ప్రాజెక్ట్ కి హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు మరో అమ్మడిని పట్టుకోవడానికి రాజమౌళి బృందం నానా తంటాలు పడుతోంది. ఇందులో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియాభట్ రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇలానే గోపీచంద్ సినిమాకి తమన్నా హ్యాండ్ ఇచ్చింది. తిరు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మొదట తమన్నానే సైన్ చేశారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో తలెత్తిన బేధాభిప్రాయాల వల్ల ఆమె డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. దీంతో మెహరీన్ ని ఫైనల్ చేశారు. అంతే కాదు రాజ్ తరుణ్ సినిమాకి కూడా అదే ఎదురైంది. ప్రస్తుతం ఆయన డెబ్యూ డైరెక్టర్ జీఆర్ కృష్ణ దర్శకత్వంలో ఇద్దరి లోకం ఒకటే సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించే ఈ మూవీ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఇందులో మొదట మేఘా ఆకాష్‌ని హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో ఇప్పుడు ఆ ప్లేస్ లో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేని ఫైనల్ చేశారట.