ఆయన వల్లే ఈరోజు బ్రతికాను – రోజా రమణి..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులలో ఒకరిగా గుర్తింపు రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో తెలియని విషయాలను పంచుకున్నారు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె భక్త ప్రహల్లాద సినిమాలో బాలనటిగా నటించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ముఖ్యంగా ఒరియా రీమేక్ లలో ఎక్కువగా నటించి ఆకట్టుకున్న ఈమె హీరో తరుణ్ తల్లిగా ఈతరం ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.. స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఎంతో అభిమానం అన్న ఆమె.. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కూడా తెలిపింది. తాతమ్మకల అనే మొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి నటించాలని తెలిపిన రోజా రమణి ఆయనతో కేవలం నాలుగైదు సినిమాలు మాత్రమే చేశానని తెలిపింది. ఇకపోతే ఒక సినిమా షూటింగ్లో భాగంగా ఆత్మహత్య చేసుకోవడానికి నేను పరిగెడుతుండగా ఆగు చెల్లమ్మ అంటూ హరికృష్ణ నా వెనకే వస్తున్నారని. ఆ సినిమాకు ఎన్టీఆర్ డైరెక్టర్ అని రోజా రమణి తెలిపారు.

ఇక కృష్ణా బ్యారేజీ రెయిలింగ్ పై ఖాళీ క్యాన్లు మీద నేను నిలబడ్డాను. అయితే ఆ క్యాన్లు ఊగుతుండడంతో ఎన్టీ రామారావు గారు వచ్చి నా కాళ్లు పడిపోకుండా పట్టుకున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే అక్కడే నా సూసైడ్ జరిగేది అంటూ ఆమె తెలిపారు. అక్కడ వేల మంది జనం ఉన్నారు అయినా ఆయన ఏమాత్రం ఆలోచించకుండా నా ప్రాణాలు కాపాడ్డానికి నా కాళ్లు పట్టుకున్నారు అంటూ ఆమె కామెంట్లు చేయగా.. ఇవి కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version