నాది కార్ల కంపెనీ కాదు..!

-

టాలీవుడ్ లో మీడియం రేంజ్ బడ్జెటులతో సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో డైరక్టర్ మారుతి ఒకరు. చిన్న బడ్జెట్ లో తను తీసిన ఈరోజుల్లో సినిమా కాస్త అడల్ట్ కంటెంట్ లా అనిపించినా ఇప్పుడు అది ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది. నాగ చైతన్యతో ఈమధ్యనే శైలజా రెడ్డి సినిమా చేసిన మారుతి తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేయలేదు. ఇక న్యూ ఇయర్ రోజు ఓ వింత అనుభూతిని పొందాడు మారుతి.

అదేంటి అంటే.. ఎవరో ఒకతను తన కారు రిపేర్ ఉందని మారుతికి ఎటాచ్ చేస్తూ ట్వీట్ పెట్టాడు. తన కారు బాగు చేయాల్సిందిగా కోరాడు సదరు వ్యక్తి. అయితే మారుతి సుజుకికి పెట్టబోయి డైరక్టర్ మారుతికి ట్యాగ్ చేశాడు. అది చూసిన మారుతి షాక్ అవ్వడమే కాకుండా నాది కార్ల కంపెనీ కాదు నేను డైరక్టర్ మారుతిని అని అతనికి సమాధానం చెప్పాడు. అంతేకాదు న్యూ ఇయర్ విష్ కూడా చేశాడు మారుతి. మొత్తానికి మారుతి కొత్త సంవత్సరం కొత్త అనుభూతి పొందాడన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news