దసరా మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

-

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని దసరా చిత్రంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మొత్తం ఐదు భాషలలో విడుదలైన ఈ చిత్రం ప్రతి చోట అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్ డాలర్స్ పైగా వసూలు సాధించి 2023లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం ఓటీటీ వేదికగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఎందుకు నెట్ లుక్స్ భారీగా వెచ్చించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దసరా చిత్రాన్ని ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 22 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. మే 30 నుండి ఈ చిత్రాన్ని ఓటిటిలో ప్రదర్శించబోతున్నారని స్ట్రీమింగ్ డేట్ పై త్వరలో అఫీషియల్ అప్డేట్ కూడా రానుందని సమాచారం..

Dasara Movie Hype Getting Affected By Unpopular Songs

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సింగరేణి కోల్ మైన్ పరిసర ప్రాంతంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కింది. దీంతో సినిమాకు క్రేజ్ పెరిగింది. వెన్నెల, ధరణి క్యారెక్టర్లకు, యాక్షన్ సీక్వెల్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా సాగింది. దసరా చిత్రం దాదాపు 120 కోట్లకు రూపాయలకు పైగా వసూలు సాధించి నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణ సంగీతాన్ని అందించాడు. నానితో పాటు కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news