అనిల్ రావిపూడి అంతు చూస్తాన‌న్న డైరెక్ట‌ర్‌… ఆ గొడ‌వ ఎందుకొచ్చింది..!

-

పటాస్ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనిల్ రావిపూడి, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత సంక్రాంతికి ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హిట్ కొట్టిన శ్రీనువైట్ల ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా రూపొందించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో మరోసారి స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ గా మారడానికి ముందు అనిల్ రావిపూడి స్క్రిఫ్ట్‌ డిపార్ట్మెంట్లో కొన్ని సినిమాలకు పనిచేశాడు. ఈ క్రమంలోనే శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమాలు సైతం అనిల్ రావిపూడి వర్క్ చేశాడు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఆగ‌డు సినిమాకు సైతం అనిల్ రావిపూడి పనిచేశాడు. తాజాగా ఈ సినిమా గురించి ప్రస్తావించిన అనిల్ ఆగ‌డు ఫ‌స్టాఫ్ స్క్రిఫ్ట్ వ‌ర్క్ పూర్త‌య్యే వ‌ర‌కు తాను శ్రీను వైట్ల‌తో క‌లిసి ప‌నిచేశాన‌ని… ఆ టైంలోనే త‌న‌కు ప‌టాస్ సినిమా ఆఫ‌ర్ రావ‌డంతో సెకండాఫ్‌కు ప‌ని చేయ‌కుండానే వెళ్లిపోయాన‌ని చెప్పాడు.

ఇప్ప‌ట‌కీ శ్రీను వైట్ల గారు ఎక్క‌డ క‌నిపించినా ‘ఏమయ్యా అప్పుడు నాతో సెకండాఫ్ కి కూర్చోకుండానే వెళ్లిపోయావ్ గా .. నీ అంతు చూస్తా’ అంటూ ఉంటార‌ని.. ఆయ‌న అలా అన్న‌ప్పుడ‌ల్లా త‌న‌కు ఎంతో బాధ అనిపిస్తుంటుంద‌ని అనిల్ చెప్పాడు. ఒక‌వేళ తాను ఆగ‌డు సెకండాఫ్‌కు కూడా ప‌ని చేసి ఉంటే ఆ సినిమా హిట్ అయ్యేదేమో అన్న ఫీలింగ్ అలాగే ఉండిపోయింద‌ని అనిల్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version