అబ్బాస్ కి హీరో విశాల్ తో విభేదాలు రావడానికి కారణం అదేనా..?

-

తమిళ స్టార్ హీరో అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో అప్పటి యూత్ లో భారీ పాపులారిటీ దక్కించుకొని.. ఆ తర్వాత రాజా, రాజహంస, శ్వేతనాగు , అనసూయ, నీ ప్రేమకై, నరసింహా తదితర చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి 2015లో ఇండస్ట్రీకి దూరమై.. విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడిపోయారు. అయితే కొన్ని రోజుల క్రితమే చెన్నైకి తిరిగి వచ్చిన అబ్బాస్ కోలీవుడ్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. తమిళ హీరోల పై తన అభిప్రాయాలను వరుసగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)విషయంలో నటుడు విశాల్ తో విభేదాలు వచ్చినట్టు తెలిపారు.

అబ్బాస్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరితో కూడా మంచి బంధాన్ని పెంపొందించుకోవాలన్నదే నా లక్ష్యం. నటుల మధ్య సోదర భావం ఉండాలనే ఉద్దేశంతోనే సీసీఎల్ ప్రారంభించారు. అయితే ఆ లీగ్ సెకండ్ సీజన్ లో మాత్రం నాకు విభేదాలు విశాల్ తో తలెత్తాయి. వాస్తవానికి విశాల్ ఎక్కువగా నా గురించి ఇతరులతో అబద్ధాలు చెప్పేవాడు. నాకు మర్యాద దక్కని చోటు ఉండడం ఇష్టం లేక ఆటను కూడా వదిలేయాలని అనుకున్నాను.

ఇక విశాల్ అన్న మాటలకు అప్పుడు చాలా బాధపడ్డాను ఏదో ఒకరోజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకొని రియలైజ్ అవుతాడని అనుకున్నాను.ఇక చిత్ర పరిశ్రమ లో విశాల్ ఇప్పటికీ ఒక భాగమే. ఏ కుటుంబంలోనైనా సరే మనస్పర్ధలు రావడం అనేది సహజం కదా.. అతడిని నేనెప్పుడో క్షమించేసాను.. అయితే ఎప్పుడైనా నాకు విశాల్ ఎదురైతే హాయ్ అంటూ పలకరిస్తాను కానీ మునుపటిలాగా అంత సన్నిహితంగా ఉండలేను అంటూ ఆరోజు చోటు చేసుకున్న పరిణామాన్ని గుర్తు చేసుకున్నారు అబ్బాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version