తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు అలా చేరువైన వారిలో ముఖ్యంగా శోభన్ బాబు సోగ్గాడిగా తెలుగు ప్రేక్షకుల మన్నునలు అందుకున్నారు.. ఆయన తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత రేంజిలో ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను అలరించిన మరో హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు హ్యాండ్సమ్ హీరో జగపతిబాబు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు జగపతి బాబు..
మొదటిసారి బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు జగపతి బాబు.. అయితే అప్పట్లో జగపతి బాబు, సౌందర్య కాంబినేషన్ సూపర్ హిట్.. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులలో బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఇద్దరు ఆన్ స్క్రీన్ మీద చాలా చూడముచ్చటగా కనిపించేవారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగపతిబాబు ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. తనకు సౌందర్యకు మధ్య ఏదో ఎఫైర్ ఉందని అందరూ అంటున్నారు.. అది నిజమే నాకు .ఆమెతో ఎఫైర్ ఉంది కానీ మీరు అనుకున్నట్టు ఆ ఎఫైర్ కాదు.. ఆమె ఒక మంచి స్నేహితురాలు.. తన అన్నయ్య కూడా నాకు మంచి స్నేహితుడు అలాగే మా రెండు ఫ్యామిలీలు చాలా క్లోజ్.
దాంతో ఆమె మా ఇంటికి వస్తూ ఉండేది . నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాణ్ణి.. కానీ అది చూసి జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. సౌందర్య అలాంటిది కాదు.. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు నేను కూడా విన్నాను.. కానీ నేను వాటిని సీరియస్ గా తీసుకోలేదు అంటూ జగపతిబాబు వెల్లడించారు.