జగపతి బాబు బయోపిక్.. ‘సముద్రం’

-

మాన్లీ స్టార్ గా.. ఫ్యామిలీ ఆడియెన్స్ మనసులు గెలిచిన స్టార్ హీరో జగపతి బాబు. నిర్మాత వి.బి రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు జగపతి బాబు. కెరియర్ మొదట్లో వాయిస్ ప్రాబ్లెమ్స్ తో ఇబ్బంది పడినా తర్వాత కవర్ చేసుకున్నాడు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ లేడీస్ నచ్చిన హీరో జగపతి బాబు. ఆయన చేసిన శుభలగ్నం, మావిచిగురు, ఆయనకు ఇద్దరు సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి.

కెరియర్ లో ఎత్తు పల్లాలను చూసిన జేబి కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కొట్టట్లేదు. ఆ టైంలో బోయపాటి శ్రీను ద్వారా లెజెండ్ సినిమాలో విలన్ అవకాశం వచ్చింది. బాలకృష్ణ సినిమాలో యాంటీ రోల్ లో అదరగొట్టాడు జగపతి బాబు. ఆ తర్వాత మళ్లీ కెరియర్ పుంజుకుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే బయోపిక్ సినిమాలు బాగా వస్తున్న ఈ టైంలో ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ వారు జగపతి బయోపిక్ తీసేందుకు రెడీ అయ్యారు.

20 ఎపిసోడ్ లుగా జేబి బయోపిక్ చెప్పబోతున్నారు. దీనికి టైటిల్ గా సముద్రం అని ఫిక్స్ చేశారట. హీరోగా మంచి క్రేజ్ సంపాదించిన ఆ టైంలో కృష్ణవంశీ అంతపురం, సముద్రం సినిమాల్లో నటించి తన సత్తా చాటాడు జగపతి బాబు. మరి జేబి బయోపిక్ అంటే అందులో ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version