రాకింగ్ రాకేష్‌తో పెళ్లిపై సుజాత ప్రకటన…!

-

కామెడీ టైమింగ్​, వైవిధ్యమైన హావాభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు రాకింగ్​ రాకేశ్​. అందుకే చాలా తక్కువ కాలంలోనే ఎక్స్​ట్రా జబర్దస్త్​లో టీమ్​లీడర్​ స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు జోర్దార్​ సుజాతగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుజాత.. రాకేశ్​ టీమ్​ ద్వారా జబర్దస్త్​లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్​లో నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఒక ప్రకటన కూడా వచ్చింది.

త్వరలోనే తమ పెళ్లి జరుగుతుందని స్వయంగా జోర్దార్ సుజాత తెలిపింది. ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె పెట్టిన యూట్యూబ్ వీడియోలో రాకింగ్ రాకేష్ తో తన పెళ్లి గురించి చెప్పింది. రాకేష్ తో కలిసి తిరుపతి వెళుతున్నామని, వెళ్తూ వెళ్తూ, నగరిలో రోజా ఇంటికి వెళ్ళామని జోర్దార్ సుజాత చెప్పింది. రోజా ఇంట్లో కూర్చొని ఓ వీడియో కూడా చేసింది. అందులో రాకేష్ అంటే తనకు ఇష్టమని, ముందుగా రోజానే తెలుసుకున్నారని అన్నారు. తమ ప్రేమకు కారణం రోజా గారు అని చెప్పుకొచ్చింది.

రోజా గారు లేకుంటే రాకేష్ తో తన పెళ్లి అనౌన్స్మెంట్ కూడా ఇంత త్వరగా వచ్చేది కాదని చెప్పింది జోర్దార్ సుజాత. జబర్దస్త్ లో అందరూ అనుకున్నట్లు కాకుండా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. త్వరలోనే పెళ్లి ఎప్పుడు ఏంటి అనేది కూడా చెబుతామంది సుజాత. ఇక ఈ వీడియో పోస్ట్ చేయగానే రాకేష్ సుజాతకు కంగ్రాట్స్ చెబుతూ అభిమానులు పోస్ట్ పెడుతున్నారు. పెళ్లి వార్త చెప్పినందుకు సంతోషం అంటూ అభినందనలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news