బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన.. కాజల్- శ్రీ లీల.. వీడియో వైరల్..!!

-

నటసింహ నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికె యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఎక్కువగా మాస్ సినిమాలకే మక్కువ చచూపుతున్నారు బాలయ్య. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న బాలయ్య ఇప్పుడు తాజాగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో బాలయ్య జోడి కి కాజల్ నటించిన బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఆకట్టుకున్నాయి. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా అప్డేట్ చాలా వెరైటీగా ఇస్తున్నారు.. గడిచిన కొద్ది రోజుల క్రితం అనిల్ రావిపూడి డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేసారని చెప్పవచ్చు ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. అయితే ఈసారి కాజల్, శ్రీ లీల ఇద్దరు కలిసి బాలయ్య సాంగ్ కి డ్యాన్స్ వేయడం జరిగింది..

బాలయ్య సినిమాలోని చిలకపచ్చ కోక పాటకు కాజల్, శ్రీ లీల కలిసి స్టెప్పులు వేయడంతో ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.. ఇద్దరు కూడా బాలయ్య పాటకి అదిరిపోయే విధంగా డాన్స్ వేసినట్టు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.ముఖ్యంగా కాజల్ పెళ్ళైన ఒక బిడ్డకు తల్లి అయిన కూడా అదే ఎనర్జీతో డాన్స్ వేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక శ్రీ లీల అయితే నెక్స్ట్ లెవెల్ లో డాన్స్ వేసింది అనే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news