నెలకు 50 వేలు జీతమిచ్చి.. పడుకోడానికి బాండ్ రాయమన్న హీరో..!

-

సీనియర్ ఆర్టిస్ట్ అని చెప్పుకున్నా ఆమెకు తగిన క్రేజ్ లేదని చెప్పొచ్చు.. కాని ఆమెని చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తాం ఆమె ఎవరో కాదు కరాటే కళ్యాణి. ఎన్నో ఒడిదుడుకులతో సినిమా కెరియర్ సాగించిన కరాటే కళ్యాణి ప్రస్తుతం చిన్న చితకా వేశాలతో కాలం వెళ్లదీస్తుంది. అయితే సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో తనని కొందరు వేధించారని.. ఆఫర్లు ఇస్తాం కాని మేము చెప్పింది చేయమని అడిగారని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.

అంతేకాదు ఓ హీరో అయితే ఏకంగా ఆమెకు నెలకు 50 వేలు జీతం ఇస్తా.. పడుకోడానికి బాండ్ రాయమన్నాడని సంచలన విషయాన్ని బయట పెట్టింది. అయితే ఆరోజు తాను ఆ పని చేసి ఉంటే ఇప్పుడు ఇంత ధైర్యంగా ఆ విషయాన్ని చెప్పేదాన్ని కాదని ఇండస్ట్రీలో మన ప్రవర్తనని బట్టి అవతల వాళ్ల మూమెంట్ ఉందని చెప్పింది.



అంతేకాదు కేవలం సినిమా పరిశ్రమలోనే కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే తాను ఒప్పుకోనని సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో అమ్మాయిలపై చేతులు వేసినా ముద్దు పెట్టుకున్నా వారు లైట్ తీసుకుంటారని కాని పరిశ్రమలో అలాంటి విషయాలు బయటకు వస్తే పెద్ద గందరగోళమే అవుతుందని అన్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి తన వృత్తి వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news