KGF: కీ మరో వెర్షన్ లా ఉన్న..ఉపేంద్ర కబ్జా సినిమా టీజర్..!!

-

కేవలం ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో కన్నడ హీరో యష్ ఒకరిని చెప్పవచ్చు. ఈ హీరో నటించిన కే జి ఎఫ్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కే జి ఎఫ్ -2 సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కొట్లు కు పైగ కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ ఒక్క చిత్రంతోనే కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీంతో ఇదే తరహాలో ఎన్నో సినిమాలు కూడా రావడం మొదలయ్యాయి.

అలా ఇప్పుడు హీరో ఉపేంద్ర నటిస్తున్న మూవీ కబ్జా మూవీ కూడా ఒకేలా కనిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీయ నటిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ R. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ఏడు భాషలలో విడుదల చేయబోతున్నారట. ఒక కీలకమైన పాత్రలో కిచ్చా సుదీప్ కూడా ఉన్నట్లు ఈ టీజర్ లో కనిపించడం జరిగింది. ఇక ఈ టీజర్ ని కొన్ని గంటల క్రితం విడుదల చేయడం జరిగింది. ఇక 1942వ సంవత్సరంలో జరిగిన ఒక యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా తెలుస్తున్నది. ఇక ఆ సంవత్సరంలోనే ఒక గ్యాంగ్ స్టార్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఈ టీజర్ లో చూపించడం జరిగింది.

ఇక ఈ సినిమా టీజర్ ని చూస్తే.. హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కే జి ఎఫ్ సినిమా ని గుర్తుచేసేలా కనిపిస్తున్నది. ఇక ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం కూడా కేజిఎఫ్ సినిమాని పోలిన వెర్షన్ కనిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే డైరెక్టర్ చందు మాత్రం ఈ సినిమాని ఒక పవర్ఫుల్ గా తీశామని కొత్త కథ అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news