కేజీఎఫ్ యశ్ పాన్ ఇండియా టార్గెట్ కోసం జాగర్తగా..!!

-

బాహుబలి తో ప్రభాస్ కు కేజీఎఫ్ తో యశ్ కు అద్భుతమైన స్టార్ డమ్ పాన్ ఇండియా స్థాయిలో వచ్చింది. అయితే ప్రభాస్ మాత్రం మళ్లీ వరసగా 4 పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకున్నాడు. కమిట్ అయిన ఇతర సినిమాలు కూడా బాలీవుడ్ లో ప్రభాస్ స్థాయిని పెంచే విధంగా లేదా బాహుబలితో వచ్చిన స్టార్ డమ్ ను మరింత ఎక్కువ చేసే అవకాశం ఉంది.

కాని  కేజీఎఫ్ 2 తర్వాత యశ్ ఒప్పుకున్న సినిమాలు ఏమి లేవు.కేజీఎఫ్ 2 విడుదల అయ్యి చాలా రోజులు గడిచి పోయాయి. యశ్ నుండి తదుపరి సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో యశ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా యశ్ సినిమా ఎంపిక విషయంలో తెలివిగా ఆలోచించలేక పోతున్నాడు అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. తాను మాత్రం ఆచి తూచి అడుగులు వేయాలని చూస్తున్నాడు.

 

యశ్  కూడా ప్రభాస్ లాగా కేజీఎఫ్ తర్వాత వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవాలను కుంటున్నాడు . అందుకే తదుపరి సినిమా విషయంలో స్పీడ్ గా నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నాడు. తదుపరి సినిమా కూడా కేజీఎఫ్ రేంజ్ లో లేకున్నా తన స్థాయిని తగ్గించేది కాకూడదు అని భావిస్తున్నాడు.అలాంటి సినిమా ఎంపిక చేసుకోవడం కోసం  యశ్ చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు .

 

Read more RELATED
Recommended to you

Latest news