సాహో ‘ కే షాక్ ఇస్తోన్న కొబ్బ‌రిమ‌ట్ట‌

-

యంగ్‌రెబ‌ల్‌స్టార్ సాహో సినిమాతో కొబ్బరిమట్ట సినిమా పోటి పడడం ఏంటి అని అనుకుంటున్నారా ?
అవును నిజమే… వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే ?  వామ్మో రూ.300 కోట్ల సినిమాకు బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ అంత పోటీ ఇస్తున్నాడా ? అంటే అవును. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బర్నింగ్ స్టార్ సంపూ నటించిన కొబ్బరిమట్ట సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో ఆగస్టు 30న విడుదల కానుంది. సాహో సినిమా ట్రైల‌ర్ శ‌నివారం సాయంత్రం విడుద‌ల అయ్యింది. ట్రైల‌ర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతూ దూసుకుపోతోంది. ఇంకా చెప్పాలంటే బాహుబ‌లి సినిమా ట్రైల‌ర్‌కు 72 నిమిషాల్లో ల‌క్ష‌లైక్స్ వ‌స్తే సాహో ట్రైల‌ర్ కేవ‌లం 28 నిమిషాల్లోనే ఆ ఫీట్ సాధించింది.

సో సాహో ట్రైలర్ రిలీజ్ కోసం మరియు కొబ్బరిమట్ట సినిమా రివ్యూ కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతుకున్నారు దీనితో సాహోతో పోటీ పడుతూ కొబ్బరిమట్ట ట్విట్టర్ ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరిపోయింది. ప్రస్తుతం సాహో ట్రైలర్ డే హాష్ ట్యాగ్ రెండో స్థానంలో ట్రెండ్ అవుతుండగా, కొబ్బరిమట్ట హాష్ ట్యాగ్ మూడో స్థానంలో ఉంది ఇది సంగతి.

ఇక సాహో ట్రైల‌ర్ అటు దుమ్ము రేపుతుంటే… ఇటి కొబ్బ‌రిమ‌ట్టకు సైతం పాజిటివ్ టాక్ వ‌చ్చింది. హృద‌య కాలేయం సినిమా త‌ర్వాత సంపూ నుంచి ఆ రేంజ్‌లో వ‌చ్చిన సినిమా ఇద‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. సినిమా త‌ప్ప‌కుండా రికార్డులు సాధిస్తుంద‌ని.. సంపూ కెరీర్‌లోనే మ‌రో ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని ప్ర‌శంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news