‘ మా ‘ లో లుక‌లుక‌లు… క్లారిటీ ఏంటంటే..!

359

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) కార్యవర్గలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేష్‌కి, రాజశేఖర్‌ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ ఉద‌యం నుంచి ఒక్క‌టే వార్త‌లు అటు మీడియా వ‌ర్గాల్లోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ ఒక్క‌టే వార్త‌లు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. వాస్త‌వానికి మా ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌ర్‌ను పోటీ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టింది న‌రేష్‌నే. ఎన్నిక‌లు ముగిసి ఫలితాలు వ‌చ్చి విజ‌యోత్స‌వ స‌భ‌నుంచే అటు న‌రేష్‌కు, ఇటు రాజ‌శేఖ‌ర్‌కు మ‌ధ్య గ్యాప్ స్టార్ట్ అయ్యింది.

ఆ వేదిక మీదే రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ న‌రేష్ ప్ర‌తి విష‌యంలోనూ నేను… నా అన‌డం క‌రెక్ట్ కాద‌ని ఖండించారు. ఆ త‌ర్వాత మా లో ఏం జ‌రుగుతుందో ? బ‌య‌ట‌కు రాలేదు. ఇక బుధ‌వారం ఉద‌యం నుంచి మాలో లుక‌లుక‌లు అంటూ ఎవ‌రికి వారు రాసేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన `మా` కార్యనిర్వాహక వర్గం ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తోంది! అంటూ మీడియాకి ఓ ప్రెస్ నోట్ ని పంపించారు.

Maa controversy rajasekhar sends show cause notice to naresh
maa controversy rajasekhar sends show cause notice to nareshmaa

‘ఓ అసోసియేష‌న్ అంటే.. చాలా స‌మస్యలుంటాయి. వాటన్నింటినీపై అంద‌రూ చ‌ర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. `మా` వెల్ఫేర్‌కి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చ‌ర్యల గురించి మంగ‌ళ‌వారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జ‌రిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సంబంధించి మీడియాకు తెలియ‌జేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియ‌జేస్తాం. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి’ అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కార్యవ‌ర్గం విజ్ఞప్తి చేసింది.

ఓవైపు తమిళనాడు రాజ‌ధాని చెన్నైలో న‌డిగ‌ర్ సంఘం భ‌వ‌నం శ‌ర‌వేగంగా కంప్లీట్ అవుతోంది. 800 పైగా ఆర్టిస్టులు ఉన్న తెలుగు ఆర్టిస్టులకు సొంత భవంతి లేదన్న ఆవేద‌న అంద‌రికి ఉంది. మ‌రి ఈ ట‌ర్మ్‌లో అయినా న‌రేష్‌, రాజ‌శేఖ‌ర్ ఈ భ‌వ‌నం కంప్లీట్ చేస్తారేమో ? చూడాలి.