మహేష్ షూటింగ్ చేస్తున్నాడా…?

-

టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే చాలు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. మహేష్ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కమర్షియల్ కోణంలో ఉంటున్న సంగతి తెలిసిందే. అగ్ర దర్శకులే కాకుండా యువ దర్శకులతో మహేష్ సినిమాలు చేస్తున్నాడు. మహేష్ సినిమాలు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో సమాజం మీద దృష్టి పెట్టినట్టు ఉంటున్నాయి. శ్రీమంతుడు, భరత్ అను నేను, మహర్షి సినిమాలు ఇలాగే ఉన్నాయి.

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత రావడం లేదు. పరుశురాం దర్శకత్వంలో మహేష్ సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్ ఇప్పుడు దూకుడుగా ఉన్నాడు. మహేశ్‌ తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. `సరిలేరు నీకెవ్వరు` కూడా కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగానే ప్రారంభమైంది.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమాలు అన్నీ కూడా ఆపేశారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని మహేష్ బాబు మొదలు పెట్టాలి అనుకోవడం వెనుక అర్ధం ఏంటీ అసలు మే 31 నుంచి షూటింగ్ ని మొదలు పెట్టడం సాధ్యం అవుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఇంట్లో ఖాళీ గా ఉన్నాడు. మరి ఈ సినిమా షూటింగ్ ని రెండు నిమిషాలు చేసి ఆపేస్తారా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news