KGF నటికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

-

ప్రముఖ నటి, కే జి ఎఫ్ ఫేమ్ మాళవిక అవినాష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కే జి ఎఫ్ నటి మాళవిక అవినాష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆసుప  త్రి బెడ్ పై చికిత్స తీసుకుంటున్న ఫోటోను మాళవిక అవినాష్.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మీలో ఎవరైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలిగ్గా తీసుకోకూడదని మాళవిక అవినాష్ ఈ సందర్భంగా తెలిపారు.

పనాడోల్స్ మరియు నెప్రోసిన్ లాంటి మందులతో పాటు… ప్రకృతి రీత్యా సంప్రదాయ ఔషధాలను కూడా వాడాలని ఆమె కోరారు. తలనొప్పే కదా అని వదిలేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఒకవేళ దీనిని లైట్గా తీసుకుంటే నాలాగే ఆసుపత్రిపాలు కావాల్సి ఉంటుందని ఆమె వివరించారు. కాగా ప్రస్తుతం మాళవిక అవినాష్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆమె హెల్త్ బులిటెన్ ఇవాళ సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు సమా చారం అం దుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news