టాలీవుడ్ స్టార్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా విభేదాలు నడుస్తున్నాయని వార్తలు వినిపిస్తూ వస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో వీరి ఫ్యామిలీలో ఉన్న గొడవల్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారగా దీనిపై స్పందించారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి గొడవ చేసినట్టు కనిపిస్తుంది. తమ్ముడు పై దాడికి ప్రయత్నిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆపుతున్న ఆ వీడియోను స్వయంగా మంచి మనోజ్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు గట్టిగానే జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా మనోజ్ తో తన గొడవపై తాజాగా స్పందించిన మంచు విష్ణు ఆసక్తికర కామెంట్ చేశారు.
మంచు మనోజ్ తో గొడవ పై స్పందించిన మంచు విష్ణు “మా ఇద్దరి మధ్య గొడవలు సాధారణమే. అది నిన్న ఉదయం జరిగిన చిన్న సంఘటన సారధితో జరుగుతున్న గొడవను మనొజ్ ఆపలేకపోయాడు. అందుకే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మనోజ్ చిన్నవాడు. ఇది ఇంతలా స్పందించాల్సిన విషయం అసలే కాదు..” అంటూ చెప్పుకొచ్చారు. కాగా మంచు విష్ణు మాట్లాడిన అనంతరం మంచు లక్ష్మి సైతం ఈ గొడవపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
గత కొన్ని రోజుల క్రితం మంచు మనోజ్ భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహం మంచు కుటుంబంలో విష్ణుకు ఇష్టం లేదని అందుకే పెళ్లికి సైతం అతిథిగా వచ్చి వెళ్ళిపోయారని వార్తలు గట్టిగా వినిపించాయి. అప్పటి నుంచి మంచు కుటుంబంలో వివాదాలు మరింత పెరిగిపోయాయని వార్తలు వినిపించగా ప్రస్తుతం ఈ వీడియోతో ఈ రూమర్లు మరింత ఎక్కువయ్యాయి..