మెగాస్టార్ తో డిజే టిల్లు.. ప్రేక్షకుల ఫీలింగ్ ఇదేనా!

-

సినీ ఇండస్ట్రీలో సాధారణంగా పెద్ద హీరోలు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా సంక్రాంతి బరిలో పలువురు స్టార్ హీరోల సినిమాలో నిలుస్తూ ఉంటాయి. సంక్రాంతి, దసరా వంటి పండగలకు ఒకే రోజు సినిమాలు విడుదలై అభిమానుల్ని అలరిస్తూ ఉంటాయి. కాగా ఇప్పటివరకు స్టార్ హీరోలు సినిమాలు మాత్రమే ఒకే రోజు విడుదల కాగా చిన్న హీరోల సినిమాలు ఆ సమయంలో విడుదల అవ్వాల్సి ఉంటే వాటిని వాయిదా వేసుకుంటూ వస్తారు. కాగా తాజాగా టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ ఫైట్ త్వరలో ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవితో యువ హీరో సిద్ధు జొన్నలగొట్ట తలపడబోతున్నాడు.

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న అనంతరం భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అయిపోతున్నారు. 2015లో విడుదలైన తమిళ చిత్రం వేదాళం మూవీకి రీమేక్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల అవ్వడానికి రెడీగా ఉంది. నిజానికి మెగాస్టార్ సినిమా ఉంది అంటే ఆ దరిదాపుల్లో సినిమా విడుదల చేయడానికి ఇతర హీరోలు ఎవరూ సాహసం చేయరు. ముఖ్యంగా చిన్న హీరోలు ఆ ధైర్యం అస్సలు చేయరు. కానీ మెగాస్టార్ తో తలపడటానికి డిజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ రెడీ అవుతున్నాడు.

తాజాగా సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండగా ఈ సినిమాను సైతం ఆగస్టు 11న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రేక్షకులంతా మెగాస్టార్ తో పోటీ ఎందుకు అంటూనే భోళా శంకర్ కన్నా టిల్లు స్క్వేర్ కే ఎక్కువగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి చిరంజీవి తప్ప ఇంకేమీ హైలెట్ లేదని ఈ సినిమా తమిళ్ వర్షన్ ఇప్పటికే చాలా మంది చూసి ఉంటారు కాబట్టి టిల్లు స్క్వేర్ కే ఎక్కువ అవకాశం ఉందంటూ చెప్పుకోవస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version