ఆచార్య సినిమా కోసం మోహన్ బాబు…!

-

ఆచార్య సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగానే చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర విషయంలో దర్శకుడు ఎవరిని ఎంపిక చేస్తాడు… అసలు ఆ పాత్ర ఎవరు చేస్తారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఆ కీలక పాత్ర కోసం రామ్ చరణ్, మహేష్ బాబు పేర్లు ప్రధానంగా వినిపించాయి. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో చాలా బిజీ గా ఉన్నాడు.

Chiran

ఇప్పటికే ఈ సినిమా విడుదల చాలా వాయిదా పడింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే మరో ఏడాది వాయిదా పడినట్టే కనపడుతుంది. ఇక ఈ సినిమాలో ఆ పాత్ర కోసం మహేష్ బాబుని ఎంపిక చేసారు అని టాక్ వినపడుతుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు కాదు ఆ పాత్ర కోసం మోహన్ బాబుని ఎంపిక చేసారని టాలీవుడ్ వర్గాలు ఇప్పుడు అంటున్నాయి. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారట.

ఈ కీలక పాత్ర కోసం మోహన్ బాబుని అడిగారని ఆయన అందుకు ఓకే చెప్పారని సమాచారం. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న నేపధ్యంలో ఆయన అందుకు ఓకే చెప్పారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news