విజయ్ దేవరకొండ పై ఆ రేంజ్ లో రివేంజ్ ప్లాన్ చేసిన నాగచైతన్య..!

-

తాజాగా నాగచైతన్య మాజీ భార్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా, విజయ్ దేవరకొండ హీరోగా విడుదలైన చిత్రం ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత మధ్య ఎంత రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయో ప్రత్యేకంగా చూసిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేని సందర్భాలలో కూడా సమంత , విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్స్ సన్నివేశాలను పెట్టారు డైరెక్టర్ శివ నిర్వాణ. ఇది సినిమా అయినప్పటికీ..సమంత తనకు మాజీ భార్య అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట నాగచైతన్యకి కోపం అనేది ఉంటుంది.

అయితే తాజాగా తన మాజీ భార్య సమంతాతో విజయ్ దేవరకొండ రొమాన్స్ చేశాడనే కోపంతో నాగచైతన్య ఎలాగైనా. రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే నాగచైతన్య విజయ్ దేవరకొండపై ఏ రేంజ్ లో రివేంజ్ ప్లాన్ చేశారో ఇప్పుడు చూద్దాం.ఇకపోతే విజయ్ దేవరకొండ తన మాజీ భార్య సమంతతో చేసిన రొమాన్స్ చూసి.. పగతో ఊగిపోతున్న నాగచైతన్య రౌడీ హీరో విజయ్ దేవరకొండ పై రివేంజ్ తీర్చుకోవడానికి తన లవర్ గా ఇండస్ట్రీలో పేరు ఉన్న రష్మిక మందన్నాని లైన్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా తన తదుపరిచిత్రంలో రష్మిక మందన్నాని హీరోయిన్గా తీసుకొని విజయ్ దేవరకొండ.. సమంత తో ఎలా అయితే రొమాన్స్ చేశారో అంతకుమించి రష్మిక తో ఆయన రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారట. అంతేకాదు నాగచైతన్య ఆలోచనలకు తగ్గట్టుగానే డైరెక్టర్ కూడా రష్మికతో ఘాటు రొమాన్స్ ఉండాలి అంటూ చెప్పినట్లు సమాచారం. ఇది చూసిన చాలామంది నెటిజెన్లు నాగచైతన్య.. విజయ్ దేవరకొండ పై ఈ విధంగా రివేంజ్ ప్లాన్ చేశాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news