సవ్యసాచి రివ్యూ & రేటింగ్

-

చందు మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో మత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా సవ్యసాచి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

వానిషింగ్ ట్విన్ సిండ్రోం వల్ల ఇద్దరుగా పుట్టాల్సిన విక్రం ఆదిత్య (నాగ చైతన్య)ఒకే శరీరాన్ని పంచుకుని పుడతాడు. అయితే ఆదిత్య మాత్రం విక్రం ఎడమ చేయితో మాత్రమే తన ప్రాణం ఉంచుకుంటాడు. అందుకే చిన్నప్పటి నుండి విక్రం ఆదిత్య ఇద్దరిని వారి తల్లి ప్రేమగా చూసుకుంటుంది. తల్లి దూరమయ్యాక విక్రం ఆదిత్యలను వారి అక్క భూమిక అంతే ప్రేమగా చూసుకుంటుంది. ఫిల్మ్ మేకర్స్ గా పనిచేసే విక్రం తన కాలేజ్ డేస్ లో నిత్య (నిధి అగర్వాల్)ను చూసి లవ్ చేస్తాడు. ఆమె కూడా విక్రం ను ప్రేమిస్తుంది. సరదాగా సాగుతున్న వీరి లైఫ్ లోకి విలన్ ఎంటర్ అవుతాడు. విక్రం ఫ్యామిలీని చెల్లా చెదురు చేస్తాడు. విక్రం బావని చంపేస్తాడు. మేనకోడలు మహాని కిడ్నాప్ చేసి చనిపోయినట్టుగా సర్టిఫికెట్స్ పుట్టిస్తాడు. అసలు ఇదంతా విలన్ ఎందుకు చేస్తున్నాడు. అతనెవరు..? అతనికి విక్రం ఫ్యామిలీతో వైరం ఏంటి..? అతన్ని కనిపెట్టి విక్రం అతన్ని ఎలా బుద్ధి చెప్పాడు..? అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

కథగా అనుకున్నప్పుడు బాగున్న కొన్ని సినిమాలు తెర మీదకు వచ్చే సరికి తేడా కొడతాయి. హీరోకి ఓ కొత్త రకం పాత్ర రాసుకుని అతని ఫ్యామిలీకి ఆపదొస్తే అతను ఏం చేస్తాడు అన్నది ఈ సినిమా కథ. కాని దర్శకుడు చందు మొండేటి స్క్రిప్ట్ మీద ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. హీరో విలన్ ట్రేసింగ్ ఎపిసోడ్ లో హీరోని ఆటబొమ్మని చేయడం అన్ని సినిమాల్లో చూసేదే అది మరి రొటీన్ గా అనిపిస్తుంది.

బలమైన ప్రతి నాయకుడిని పెట్టాడు. విలన్ పాత్రలో మాధవన్ కూడా బాగా చేశాడు. కాని అంత బలం గా రాసుకున్న ఆ పాత్రని క్లైమాక్స్ లో సింపుల్ గా చంపేస్తాడు. సినిమా మొదటి భాగం కూడా ఏదో అలా అలా కానిచ్చాడు. సెకండ్ హాఫ్ లో పద్మవ్యూహం అన్నాడు కాని అంత సీన్ లేదు.

ఓ రొటీన్ రివెంజ్ డ్రామాని హీరో పరంగా కొత్త రకంగా పాత్రని రాసుకున్నాడు దర్శకుడు. అయితే అది సక్సెస్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. కార్తికేయతో ప్రతిభ చాటిన చందు సవ్యసాచిలో తేలగొట్టేశాడు అని చెప్పొచ్చు. కంటెంట్ మీద ఇంకాత వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఎలా చేశారు :

విక్రం ఆదిత్యగా నాగ చైతన్య అలరించాడు. ముఖ్యంగా ఎడమ చేయి వల్ల ఇబ్బందులు పడిన సీన్స్ లో అలరించాడు. ఎడమ చేయి తన మాట వినని టైంలో తన ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఆకట్టుకుంది. అయితే సినిమాలో ఆమెకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదని చెప్పాలి. వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్, తాగుబొతు రమేష్, షకలక శంకర్ అందరు ఉన్నా కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. హైపర్ ఆది డ్రామా సీన్ ఎందుకు పెట్టారో అర్ధం కాదు. విలన్ గా మాధవన్ మరోసారి తన టాలెంట్ చూపాడు. భూమిక తన పాత్రకు న్యాయం చేసింది.

కీరవాణి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. కథ, కథనం దర్శకుడు అనుకున్న స్థాయిలో తీయలేదు. చందు ఇంకాస్త స్క్రిప్ట్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ ఓకే.

ప్లస్ పాయింట్స్ :

నాగ చైతన్య

మాధవన్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

స్క్రీన్ ప్లే

లీడ్ పెయిర్ కెమిస్ట్రీ

బాటం లైన్ :

సవ్యసాచి.. మెప్పించలేని ప్రయత్నం..!

రేటింగ్ : 2.5/5

Read more RELATED
Recommended to you

Latest news