నాగార్జున `బంగార్రాజు`కి లైన్ క్లియర్.. హీరోయిన్లు కూడా ఫిక్స్‌..!!

-

నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. విలేజ్‌ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున కనిపించిన బంగార్రాజు పాత్రకు సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒక‌టి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2016 సంక్రాంతి కానుకగా విడుదలై అశేష తెలుగు ప్రజానికాన్ని విశేషంగా ఆకట్టుకుంది. కట్ చేస్తే… నాలుగేళ్ల విరామం అనంతరం ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి కొనసాగింపు చిత్రం తెరకెక్కనుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఆ సినిమాలో నాగ‌ర్జున‌ పోషించిన ‘బంగార్రాజు’ పాత్రకి మంచి ఆదరణ లభించింది.

దాంతో ఆ పాత్రనే టైటిల్ గా సెట్ చేసుకుని, అదే కల్యాణ్ కృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని నాగార్జున నిర్ణయించుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ వచ్చింది. తాజాగా పరిస్థితులన్నీ అనుకూలంగా మారడంతో, జూన్ నుంచి ఈ సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణనే కనిపిస్తుంది. చైతూ జోడీగా రష్మికను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో ఇటు నాగార్జునకి .. అటు చైతూకి హిట్లు ఇచ్చిన కల్యాణ్ కృష్ణ, ఈ ఇద్దరికీ కలిపి భారీ విజయాన్నే అందిస్తాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version