బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : అఖండ నుంచి పోస్టర్ రిలీజ్

నందమూరి బాలయ్య పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది “అఖండ” టీం. ఈ మేరకు బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న “అఖండ” సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో బాలయ్య క్లాస్ లుక్ లో కనిపించాడు. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ పాట మధ్యలోని సన్నివేశంలా కనిపిస్తోంది. చేతి గడియారం పెట్టుకొని… నోటిపై చిరునవ్వుతో కనిపిస్తున్నారు ఈ పోస్టర్ లో. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఉగాది రోజున విడుదల అయిన ఈ చిత్రం వీడియో సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే..

ఇది ఇలా ఉండగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలకు ఆయన ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. జూన్ 10న అంటే రేపు బాలయ్య పుట్టిన రోజు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరాలు జరుపుకోనున్నారు. కరోనా ఈ నేపథ్యంలో బహిరంగ వేడుకలకు అనుమతి లేదు. అటు బాలయ్య కూడా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించకూడదని సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన సంగతి తెలిసిందే.