‘గ్యాంగ్ లీడర్’ రివ్యూ: డీసెంట్ మూవీ గ్యాంగ్ లీడ‌ర్

-

రివ్యూ : గ్యాంగ్ లీడ‌ర్
బ్యాన‌ర్‌: యూవీ క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: నాని, ప్రియాంక అరుళ్‌మోహ‌న్‌, కార్తీకేయ‌, ల‌క్ష్మి త‌దిత‌రులు
మ్యూజిక్‌: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌
నిర్మాత‌లు: వై.న‌వీన్‌, వై.ర‌వి, చెరుకూరి మోహ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ కె.కుమార్‌
రిలీజ్ డేట్‌: 13 సెప్టెంబ‌ర్‌, 2019

టాలీవుడ్‌లో హీరో నానిది మిన‌మ‌మ్ గ్యారంటీ సినిమా. జెర్సీ లాంటి ఎమోష‌న‌ల్ హిట్‌ను అందుకున్న నాని..ఇప్పుడు గ్యాంగ్ లీడ‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇష్క్‌, మ‌నం, 24లాంటి వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలతో ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేసిని విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్‌లీడ‌ర్ సినిమా తెర‌కెక్కింది. ఇక ఇందులో నానికి జోడిగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టించ‌గా.. హీరో కార్తికేయ మొద‌టిసారిగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించారు. ఈ అరుదైన కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే అంద‌రిలో ఆస‌క్తిపెరిగింది. ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా.. అని ఎదురుచూశారు. శుక్ర‌వారం విడుద‌ల అయిన ఈ సినిమా ఏమేర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

Nani Gang Leader Review
Nani Gang Leader Review

క‌థ‌…

ఇక క‌థ‌లోకి వెళ్దాం.. సినిమాలో పెన్సిల్(నాని) ఒక క‌థా ర‌చ‌యిత‌గా ఎద‌గాల‌ని అనుకుంటాడు. ఈ క్రమంలోనే ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతుంది. ఈ చోరీ కేసును ఛేదించేందుకు మొత్తం ఐదుగురు ఆడవాళ్లు టీమ్‌గా ఏర్ప‌డుతారు. ఆ త‌ర్వాత తమ గ్యాంగ్ కు లీడర్ గా ఉండాలని నానిని కోరుతారు. అయితే.. స్టోరీ రైట‌ర్‌గా మారాల‌ని అనుకున్న‌ నాని గ్యాంగ్ లీడర్ ఎలా అయ్యాడు..? అందుకు దారితీసిన ప‌రిస్థితులు ఏమిటి..? ఆ దొంగ‌త‌నానికి ఈ ఐదురుగు ఆడ‌వాళ్ల‌కు ఉన్న స‌బంధం ఏమిటి..? మ‌రి ఈ గ్యాంగ్ ఆ దొంగ‌త‌నాన్ని ఛేదించిందా..? ఇందులో కార్తికేయ‌(దేవ్) పాత్ర ఏమిటి..? ఇక నానికి, హీరోయిన్ ప్రియాంకాల మ‌ధ్య ల‌వ్ ఎలా పుడుతుంది..? ఈ క్ర‌మంలో ఎలాంటి ట్విస్ట్‌లు వ‌చ్చాయి..? అన్నది తెలుసుకోవాలంటే మాత్రం సినిమాను చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌..

క‌థ‌ను ఎంచుకోవ‌డం.. దానిని అనుకున్న‌ది అనుకున్న‌ట్టు తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. మొద‌ట క‌థలో వేగం కొంచెం నెమ్మ‌దించినా.. స‌మ‌యం గ‌డిచినా కొద్దీ ప్రేక్ష‌కుడు లీన‌మ‌వుతాడు. ఈ క్ర‌మంలో వ‌చ్చే మ‌లుపులు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌ధానంగా దొంగ‌త‌నం కేసు ఇన్వెస్టిగేష‌న్ సీన్స్ సూప‌ర్బ్ అని చెప్పొచ్చు. ఆ ఐదుగురు ఆడ‌వాళ్లు, నానిల మ‌ధ్య వ‌చ్చే ప‌లు స‌న్నివేశాలు, వెన్నెల కిశోర్ మార్క్ కామెడీ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే.. నాని, ప్రియాంకల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. ఇక మొట్ట‌మొద‌టి సారిగా నెగెటివ్ షేడ్‌లో క‌నిపించిన కార్తికేయ ఎంట్రీ త‌ర్వాత సినిమా మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది.

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ తాను రాసుకున్న కథ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఒక కొత్త కథను చూసిన ఫీలింగ్ ను సినిమా చూసే ప్రేక్షకుడికి ఇస్తుంది. నాని, కార్తికేయల పాత్రలను ఎక్కడా కూడా తగ్గించకుండా విక్రమ్ తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. ఫ‌స్టాఫ్ కాస్త స్లో అయిన ఫీలింగ్ క‌లుగుతుంది. సెకండాఫ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. సినిమా క్లైమాక్స్‌కు వ‌చ్చేస‌రికి కుర్చీ అంచున కూర్చునేలా కథనం మారిపోతుంది. కానీ మళ్ళీ అక్కడే సినిమాను కాస్త డౌన్ చేస్తారు.

న‌టీన‌టులు

ఈ సినిమాలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా హీరో నాని నిలిచాడు. త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. హీరోయిన్ ప్రియాంక కూడా త‌న పాత్ర‌కు నూటికినూరుశాతం న్యాయం చేసింది. కార్తికేయ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో అద‌ర‌గొట్టాడ‌ని చెప్పొచ్చు. ఇక వెన్నెల కిశోర్ త‌న‌దైన మార్క్ కామెడీతో ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పంచాడు. మిగ‌త న‌టీన‌టులు కూడా త‌మ‌త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. ఇక అనిరుధ్‌ అందించిన సంగీతం సినిమాకు అద‌న‌పు బ‌లంగా నిలిచింది. మొత్తంగా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ మ‌రోసారి వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌తో తానెంత ప్ర‌త్యేక‌మో నిరూపించుకున్నాడు. హీరో నాని కూడా మ‌రోహిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ప్ల‌స్‌లు (+) :
– డిఫ‌రెంట్ స్టోరీ లైన్‌
– న‌టీన‌టుల పెర్పామెన్స్‌
– క‌థ‌లో భాగంగా వ‌చ్చే ట్విస్టులు
– కొన్ని కామెడీ సీన్లు

మైన‌స్‌లు (-):
– ఫ‌స్టాఫ్ స్లో నెరేష‌న్‌
– ఆక‌ట్టుకోని పాటలు
– స‌రిగా క‌నెక్ట్ కాని ఎమోష‌న్‌
– హీరో, హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ మిస్‌

ఫైన‌ల్‌గా…
గ్యాంగ్ లీడర్ ఆసక్తికరమైన, సృజనాత్మక కథాంశం ఉంది. అయితే క‌థ‌నం మాత్రం మ‌రీ అంత ఆస‌క్తిగా ఉండ‌దు. ఫ‌స్టాఫ్‌లో పాత్ర‌ల ప‌రిచ‌యాలు, కామెడీ, సెంక‌డాఫ్‌లో అస‌లైన క‌థ ఉంటుంది. ఓవ‌రాల్‌గా ఈ వారాంతంలో ఓ సారి చూడొచ్చు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ్యాంగ్‌లీడ‌ర్ ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో ? చూడాలి.

గ్యాంగ్‌లీడ‌ర్ manalokam.com రేటింగ్‌: 3 / 5

Read more RELATED
Recommended to you

Latest news