నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఏడాది అలరించే మూవీస్/వెబ్‌ సిరీస్‌లు ఇవే

-

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఏడాది అదిరిపోయే సినిమాలు, సిరీస్లతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో మార్చి నెలతో పాటు ఈ ఏడాదిలో రిలీజ్ కానున్న సూపర్ హిట్ చిత్రాలు, సిరీస్ల విశేషాలను పంచుకుంది. ప్రస్తుతం ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలోనే ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వాటి వివరాలు తెలుసుకుందామా?

నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించిన సినిమాలు, సిరీస్‌లు ఇవే.. 

సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌ వెబ్సిరీస్

కృతి సనన్‌, కాజోల్‌ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దోపట్టి’.

పంకజ్‌ త్రిపాఠీ, సారా అలీఖాన్‌, విజయ్ వర్మ, డింపుల్‌ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మర్డర్‌ ముబారక్‌’

షబానా అజ్మీ, జ్యోతిక, నిమేషా సజయన్‌, సాయి తమంకర్‌, షాలినీపాండే కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘డబ్బా కార్టెల్‌’

విజయ్‌వర్మ, పంకజ్ కపూర్, అరవింద స్వామి, నసీరుద్దీన్‌ షా, దియా మీర్జా కీలకపాత్రలో నటించిన ‘ఐసీ 814’

విక్రమ్‌ ప్రతాప్‌, అమిత్‌ విక్రమ్‌ పాండే, రవి కిషన్‌ కీలకపాత్రల్లో నటించిన లీగల్‌ కామెడీ డ్రామా ‘మామ్లా లీగల్‌ హై’

తాహిర్‌ రాజ్‌ భాసిన్‌, శ్వేత త్రిపాఠి, నటించిన రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘యే కాలీ కాలీ అంఖీన్‌’-2

ప్రజక్త కోలి, రోహిత్‌ సరాఫ్‌ల లవ్ స్టోరీ మిస్‌ మ్యాచ్‌ సీజన్ -3

నీరజ్‌ పాండే దర్శకత్వంలో ‘ఖాకీ: ది బెంగాల్‌’ చాప్టర్‌

జితేంద్రకుమార్, అహ్సాస్ చన్నాల కోటా ఫ్యాక్టరీ సీజన్‌ 3

తాప్సీ పన్నూ, విక్రాంత్ మాస్సీ, సన్నీ కౌశల్ నటించిన ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా

Read more RELATED
Recommended to you

Exit mobile version