ప్రభాస్ కోసం బాలీవుడ్ నిర్మాతలు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా కుళ్ళు కుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రోజెక్ట్ కె, స్పిరిట్ ఇలా ఉంది మనోడి సినిమాల జాబితా ఇవన్ని 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు ఉన్నాయంటే ప్రభాస్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఇది ఇప్పటి వరకూ ఇండియాలో ఎవరికి సాధ్యం కాని రికార్డ్ అందుకే సూపర్ స్టార్ గా ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత  ప్రస్తుతం తన దృష్టి అంతా రెండు ప్రాజెక్ట్ లపై పెట్టాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’లో , మరియు ప్రోజెక్ట్ కె సినిమాలలో  నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి  దించారు.ఈ విలన్‌ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్  కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు వీటి అన్నింటి మధ్యలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.హారర్ కామెడీ నేపథ్యంతో సాగే స్టోరీ ఇది.

ఇక పఠాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ నెక్స్ట్ మూవీగా ఫైటర్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇది కూడా ఆయన మార్క్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. దీని తర్వాత సినిమా గా  హృతిక్-ప్రభాస్ లతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రభాస్ కూడా ఒకే చెప్పి  ఈ చిత్రం కోసం ఆయన రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ అయితేనే అంటున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టినట్లే అని తన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news