ది కేరళ స్టోరీ మూవీ పై ప్రధాని ఏమన్నారంటే..!

-

విడుదలకు ముందే సంచలనం సృష్టించిన సినిమా ది కేరళ స్టోరీ మే 5న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై ప్రధాన మోడీ స్పందించారు.

ఎన్నో వివాదాలు మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టోరీ చిత్రం ఉగ్రవాదుల కుట్రని బయట పెట్టే విధంగా ఉందని మద్దతు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ కేరళ స్టోరీ చిత్రం గురించి ప్రస్తావించారు. ప్రధాన మోడీ అంతటి వారు ఈ సినిమాపై స్పందించడంపై ఆ చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. తాజాగా ఈ విషయంపై స్పందించారు ది కేరళ స్టోరీ నిర్మాత.

ది కేరళ స్టోరీ

‘మాకు ఇంతకంటే ఇంకేం కావాలి. కేరళ హైకోర్టు అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రధాని మోడీ తన ప్రసంగంలో మా చిత్రానికి మద్దతు తెలిపారు. మేం ఈ చిత్రంలో చెప్పిన అంశాన్ని ఆయన హైలైట్ చేశారు. మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం.. ఈ చిత్రం టెర్రరిజం వ్యతిరేకం.. ఏ మతానికి వ్యతిరేకం కాలేదు అని’ అంటూ విపుల్ స్పందించారు.

కేరళ స్టోరీ చిత్ర విడుదల అడ్డుకోవాలని వేసిన పిటిషన్ ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ చిత్రం విడుదలని ఆపేసేంత వివాదాస్పద అంశాలు ట్రైలర్ లో లేవని కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే సినిమాలో సైతం ఏ ఒక్క మతాన్ని కించపరిచే విధంగా లేదని 32,000 మంది ట్రాప్ చేయబడ్డారని సినిమాలో ఎక్కడా చెప్పలేదని తెలుస్తోంది. సినిమా ఎంతో ఆసక్తిగా కొనసాగిందని ప్రతి ఒక్కరూ ఎంత బాగా నటించారని తెలుస్తోంది. ఈ చిత్రంలో అదా శర్మ నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. హిందూ యువతి అయిన ఆమె ట్రాప్ చేయబడి ముస్లిం గా కన్వెర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆమెని బలవంతంగా ఐఎస్ఐఎస్ లో జాయిన్ చేస్తారు. అక్కడ ఆమె ఎలాంటి చిత్రవధ అనుభవించింది అనే.. ఆమె తరహాలో ఇతర కేరళ మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశాలని ఈ చిత్రంలో చూపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version