సల్మాన్‌ఖాన్ నటించిన భారత్ సినిమా ఈ నెల 5వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు భారత్ అనే పేరు కరెక్ట్ కాదని చెబుతూ విపిన్ త్యాగి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
మన దేశంలో ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే.. కొత్త సినిమాలు విడుదలవుతున్నాయంటే.. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు వివాదాలకెక్కుతుంటాయి. గతంలో అనేక సార్లు పలు సినిమాలు వివాదాస్పదం అయ్యాయి. అయినప్పటికీ చిత్ర దర్శక నిర్మాతలు అన్ని అవరోధాలను దాటుకుని సినిమాలను విడుదల చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నటించిన భారత్ సినిమాకు కూడా ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. ఆ సినిమాపై ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు.
సల్మాన్‌ఖాన్ నటించిన భారత్ సినిమా ఈ నెల 5వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు భారత్ అనే పేరు కరెక్ట్ కాదని చెబుతూ విపిన్ త్యాగి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ సినిమా.. పేరు చిహ్నాలు, పేర్ల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని అతను తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో సల్మాన్ తన పేరును దేశంతో పోల్చడంపై కూడా అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సినిమా పేరు తమ లాంటి దేశభక్తుల మనోభావాలను కించపరిచేలా ఉందన్నారు. అలాగే ఈ సినిమాలో భారత్ పేరును దేశంతో పోల్చడంపై ఉన్న డైలాగులను కూడా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే ఈ పిటిషన్‌పై చిత్రయూనిట్ ఇంకా స్పదించలేదు. కాగా సల్మాన్‌తో గతంలో సుల్తాన్, టైగర్ జిందా హై తదితర సూపర్‌హిట్ చిత్రాలను తీసిన అలీ అబ్బాస్ జాఫర్ ప్రస్తుతం భారత్ సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేయగా, దానికి అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్, దిశా పటానీలు హీరోయిన్లుగా నటిస్తుండగా, సల్మాన్ ఇందులో 18 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు పలు గెటప్‌లలో అభిమానులను అలరించనున్నాడు..!