Pushpa: ‘పుష్ప’రాజ్‌గా అమితాబ్ బచ్చన్..డైలాగ్‌తో అదరగొట్టిన బిగ్ బీ

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’..సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదలై నెలలు గడుస్తున్నా మేనియా మాత్రం ఇంకా కొనసా..గుతోంది. పిక్చర్ లో అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అని అభిమానులే కాదు..సినీ లవర్స్ అంటున్నారు.

బాలీవుడ్ ఈ చిత్రం చూసి ఫిదా అయిపోయింది. బీ టౌన్ సినీ ప్రముఖులు, క్రికెటర్స్, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ‘పుష్ప’ డైలాగ్స్ తమ నోట చెప్తూనే ఉన్నారు. రాజకీయ నాయకులు సైతం ‘పుష్ప’ డైలాగ్స్ చెప్తున్నారు.

అంతలా ఈ సినిమా బాగా పాపులర్ అయింది. తాజాగా ఈ సినిమా డైలాగ్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చెప్పారు.‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్ క్వశ్చన్ అడుగుతున్న క్రమంలో ‘‘పుష్ప నామ్ సున్ కే..ఫ్లవర్ సమ్జే క్యా..ఫైర్ హు మే’’ అని పేర్కొని..తర్వాత క్వశ్చన్ అడిగారు.

Amithab
Amithab

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఈ వీడియో చూసి సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. ‘పుష్ప’ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news