అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందుగానే ‘పుష్ప 2’

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పుష్ప సినిమా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ పుష్ప 2 నుంచి ఓ కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వాస్తవానికి పుష్ప 2 మూవీ డిసెంబర్ 06న విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా  పుష్ప-2 నిర్మాతలు నేడు ప్రెస్ మీట్ నిర్వహించి థియేటర్స్ లొ డిసెంబర్ 5న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

అదేవిధంగా  ‘X’ వేదికగా అల్లు అర్జున్ పోస్టర్ ని కూడా  విడుదల చేశారు.  ఒక రోజు ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని తెలిపారు. దీంతో అభిమానుల్లో కాస్త ఆసక్తి ఎక్కువ అయిందనే చెప్పాలి.  “ఒక రోజు ముందే రికార్డుల వేట, పుష్ప రాజ్ పాలన ప్రారంభం కానుంది” అనే పవర్ ఫుల్ క్యాప్షన్ పోస్ట్  చేశారు. అయితే ఈ పోస్టర్ లో అల్లు అర్జున్  గన్ పట్టుకుని స్టైలిష్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం  మేకర్స్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version