టాలీవుడ్ స్టార్ కపుల్స్ రామ్ చరణ్ ఉపాసన ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరు బేబీ మూన్ ట్రిప్ ను చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసనా సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా, తన భార్య ఉపాసన పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు రామ్ చరణ్. ఉపాసనతో పెళ్లయి పదేళ్లు అయ్యిందని, పిల్లల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నానని హీరో రామ్ చరణ్ వెల్లడించారు. ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వ్యక్తిగత జీవితంపై యాంకర్ ప్రశ్నించారు. ‘మీరు త్వరలో నాన్న కాబోతున్నారని విన్నాము. ఎలా ఫీలవుతున్నారు’ అని అడగ్గా, ‘చాలా సంతోషంగా ఉంది’ అని చెర్రీ తెలిపారు.