ఇవాళ ఒంగోలు పోలీస్ స్టేషన్ కు రాంగోపాల్ వర్మ రానున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ..హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 19న విచారణకి హాజరుకాకుండా వారం రోజులు గడువు కోరారు రాంగోపాల్ వర్మ. ఇక డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని 20వ తేదీన మరోసారి నోటీసు ఇచ్చారు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్. ఈ తరునంలోనే రాంగోపాల్ వర్మ వాట్సప్ కి నోటీసు పంపారు సీఐ శ్రీకాంత్..
ఇక ఇవాళ ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో వర్మ విచారణకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎప్పుడైనా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. హాజరు కావచ్చని తెలిపారు పోలీసులు. వర్మ ఇవాళ పోలీసుల విచారణకు హాజరుకాకుంటే తదుపరి చర్యలకు వెళ్లనున్నారు పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు రాంగోపాల్ వర్మ.