BREAKING : జబర్ధస్త్ నుంచి రష్మి ఔట్..కొత్త యాంకర్‌ ఎవరంటే ?

-

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఒకవైపు హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు యాంకరింగ్ చేస్తూ పలు షోలతో బిజీగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది రష్మీ. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కూడా ఏదో విధంగా స్పందిస్తూ ఉంటుంది.

అయితే..బుల్లితెరపై విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ‘జబర్దస్త్’ షో నుంచి యాంకర్ రష్మీ గౌతమ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోలో రష్మీ స్థానంలో కొత్త యాంకర్ గా సీరియల్ నటి సౌమ్యరావు కనిపించింది. దీంతో రష్మీ జబర్దస్త్ షోలో కనిపించబోదని తెలుస్తోంది. అయితే సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండడం వల్ల రష్మీ రాలేదని కొందరు అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news