మొదటిసారి గీత గోవిందం సినిమా ద్వారా వీరిద్దరి కాంబినేషన్ మొదలైందని చెప్పవచ్చు.ఈ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇక ఇలా వీరిద్దరూ రెండుసార్లు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు బయట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ముంబై వీధుల్లో కలిసి తిరగడం, రెస్టారెంట్లు, పార్టీలకు, ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉండడం చూసి ఇలాంటి వార్తలకు మరింత బలం చేకూరింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్ అయినా సరే రష్మిక మందన్న హాజరవుతూ ఉండడం గమనార్హం. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రష్మిక వంతు వచ్చిందని చెప్పాలి.
ఇప్పటికీ ఆమె ఎవరిని చూస్తోంది? లేదా ఆమె ఈ వ్యక్తితో ఉందా ?అని ఆలోచిస్తుంటారు. నటీనటులు లైన్ లైట్ లో ఉంటారు కాబట్టి మీరు దాని గురించి మాట్లాడవచ్చు కానీ నా విషయానికి వస్తే నేను నా మాటల్లో చెప్పేంతవరకు కంక్లూజన్ కి రావద్దు అంటూ రష్మిక తెలిపింది. కేవలం తన పనిపై మాత్రమే దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది రష్మిక.