Remuneration: సీనియర్ హీరోలలో ఎవరిది పై చేయి..?

-

ప్రస్తుతం సినిమాల బడ్జెట్ లు భారీ పెరిగిపోతున్న నేపథ్యంలో స్టార్ హీరోల క్రేజ్ కూడా అంతకంతకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా తమ పారితోషకాన్ని పెంచుతూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇకపోతే మార్కెట్ కి అనుగుణంగా రెమ్యునరేషన్ పెంచడంలో తప్పు లేదని కూడా స్టార్ హీరోలు భావిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలు లేదా అంతకుమించి డిమాండ్ చేస్తుండగా సీనియర్ స్టార్ హీరోలు కూడా తమ సినిమాల కలెక్షన్లకు అనుగుణంగా పారితోషకం తీసుకుంటూ దూసుకుపోతున్నారు.

మన సీనియర్ స్టార్ హీరోలలో ఎవరి పారితోషకం ఎంత? ఎవరిది పై చేయి అనే విషయానికి వస్తే తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద మరొకసారి మెగాస్టార్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేశారు. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ. 50 కోట్ల పారితోషకం తీసుకున్నారని సమాచారం. గత రెండు సినిమాలకు కూడా చిరంజీవి ఇదే స్థాయిలో పారితోషకం తీసుకున్నారట. బాలకృష్ణ విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన 14 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

వెంకటేష్ 12 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటుంటే.. నాగార్జున 10 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు. రవితేజ 20 కోట్ల రూపాయలు రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే సీనియర్ స్టార్ హీరోల పారితోషకం విషయంలో మెగాస్టార్ చిరంజీవి పై చేయి అని స్పష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version