Saindhav OTT : ఓటీటీలోకి వచ్చేసిన సైంధవ్ సినిమా..ఎక్కడ చూడొచ్చు?

-

హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన తాజా చిత్రం సైంధవ్‌ . ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.వెంకటేష్‌ నటించిన 75వ చిత్రనికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Saindhav Movie OTT Streaming

ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. అయితే,విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “సైంధవ్” మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతుంది. డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version