ప్రియాంక చోప్రా తల్లిగా సమంత.. ఇండియన్ వెర్షన్ ‘సిటడెల్’ ప్రీక్వెలే

-

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోందంటూ బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా సామ్ క్లారిటీ ఇచ్చింది. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌, స్టాన్లీ టుక్కీ ప్రధాన పాత్రల్లో హాలీవుడ్‌ దర్శకులు జోష్‌ అపెల్బమ్‌, బ్రెయాన్‌ ఓహ్‌, డేవిడ్‌ వీల్‌ రూపొందించిన వెబ్‌సిరీస్‌.. ‘సిటడెల్‌’ గురించి తెలిసిందే. ఇదే సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో తెరకెక్కుతోంది. రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో వరుణ్‌ధావన్‌, సమంత ప్రధాన పాత్రధారులు.

హాలీవుడ్‌ ‘సిటడెల్‌’కు.. ‘ఇండియన్‌ సిటడెల్‌’ ప్రీక్వెల్‌ అని, అందులో ప్రియాంకకు తల్లిగా సమంత కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీని గురించి సమంత మాట్లాడుతూ.. అవును.. నేను నాదియా సిన్హ్‌కు తల్లిగా నటిస్తున్నానని చెప్పింది. నాదియా నిన్హ్‌ ఎవరో కాదు.. ‘హాలీవుడ్‌ సిటడెల్‌’లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్ర పేరు. అంటే.. ప్రియాంక పోషించిన క్యారెక్టర్‌కు తల్లిగా నటిస్తున్నానని సమంత చెప్పిందేగానీ ప్రియాంకకు తల్లిగా యాక్ట్‌ చేస్తున్నానని కాదు.

Read more RELATED
Recommended to you

Latest news