టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అలనాటి సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1957లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన గీతాంజలి.. సహనటుడు రామకృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు.
1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కలవారి కోడలు, డా. చక్రవర్తి, బొబ్బిలియుద్ధం, దేవత, గూఢచారి116, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు.
గీతాంజలి స్వస్థలం కాకినాడ. అప్పట్లో గీతాంజలి వివాహం ఓ సంచలనం.. ఆమె తన సహనటుడు రామకృష్ణను ప్రేమ వివాహం చేసుకున్నారు. గీతాంజలి తెలుగువారైనా మొదటి సినిమా హిందీ కావడం విశేషం.
హిందీలో పేయింగ్ గెస్ట్ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె చివరగా నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రంలో కనిపించారు. గీతాంజలి మరణవార్త తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది. గీతాంజలి మృతి విషయం తెలిసి టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. చాలామంది ప్రముఖులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు.