Shaakuntalam : సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..‘శాకుంతలం’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

-

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఈ సినిమా తెలుగు, హందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా ‘శాకుంతలం’ సినిమా రూపొందింది. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు.


నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. “శాకుంతలం” మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఏప్రిల్‌ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. కాగా, ఫిబ్రవరి 17న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా, ఆ డేట్‌ న రిలీజ్‌ చేయలేమని ఇటీవలే పేర్కొంది చిత్ర బృందం. కానీ తాజాగా ఏప్రిల్‌ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news