చిన్న సినిమా ముందు స్టార్ హీరోలకు అవమానం.. ఏమైందంటే..?

-

హీరో , హీరోయిన్ ఎవరైనా సరే కంటెంట్ బాగుంటే వారికే ప్రేక్షకులు ఓటు వేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాలను మరి పెద్ద హీరోలు దృష్టిలో పెట్టుకోవడం లేదో ఏమో తెలియదు కానీ వారి నిర్లక్ష్యమే చిన్న సినిమాల ముందు వారి గౌరవాన్ని కించపరిచేలా చేస్తోందని చెప్పవచ్చు. ఇక సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటిదే జరిగింది. ఒక సినిమా ప్రేక్షకులను మెప్పించింది అంటే.. అది రోజులతో సంబంధం లేకుండా కలెక్షన్లను వసూలు చేస్తూ ఉంటుంది. అంతేకాదు పెద్ద సినిమా వచ్చినా సరే ఆ సినిమా తో పాటే ఈ సినిమాను కూడా థియేటర్లలో వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలు పూర్తిగా అవమానపడ్డారు అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు విషయంలోకెళితే తాజాగా విడుదలైన బేబీ అనే చిత్రం అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. ఆనంద్ దేవరకొండ హీరోగా, యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తాజాగా విడుదలైన చిత్రం బేబీ.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనం సృష్టించింది. రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టిస్తోంది ఈ సినిమా. ఇకపోతే ఒక్క కలెక్షన్ల పరంగానే కాదు తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో, ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలను కూడా డామినేట్ చేసింది అంటే సాధారణమైన విషయం కాదు

ఈ రెండు సినిమాల కంటే కూడా కొన్ని సెంటర్స్ లలో అదే రోజు బేబీ సినిమాకి ఎక్కువ వసూలు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆరవ రోజు కూడా బేబీ రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేయగా.. ఆది పురుష్ , బ్రో సినిమాలు కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు సాధించాయి. ఇక దీంతో చిన్న సినిమా ముందు పెద్ద హీరోల సినిమాలు నిలబడలేదనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version