ప్రిన్స్ మూవీ కోసం శివ కార్తికేయన్ పారితోషకం అన్ని కోట్లా..?

-

శివ కార్తికేయన్.. కోలీవుడ్ యంగ్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ తాను నటించిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.. డాక్టర్ బాబు, డాన్ వంటి సినిమాలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న శివ కార్తికేయన్ నేరుగా తెలుగులో నటిస్తున్న సినిమా ప్రిన్స్.. ఇక ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలో విడుదల చేయబోతున్నారు ఇక ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అలాగే ఏషియన్ మూవీ సంస్థ వారు సంయుక్తంగా నిర్మిస్తుండడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి.

రెండూ కూడా బడా నిర్మాణ సంస్థలు కావడంతో శివ కార్తికేయన్ కూడా తన రేంజ్ కి తగ్గట్టుగా పారితోషకం డిమాండ్ చేశాడనే వార్త ఇటీవల సంచలనంగా మారింది. ఈ మధ్యకాలంలో హీరోలైనా, హీరోయిన్లైనా తమ సినిమాలు సక్సెస్ సాధించాయి అంటే తమ తదుపరి చిత్రం కోసం పారితోషకం డిమాండ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే . ఇక ఈ క్రమంలోనే శివ కార్తీకేయన్ ఏకంగా స్టార్ హీరో రేంజ్ లో పారితోషకం డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రిన్స్ మూవీ కోసం ఏకంగా 30 కోట్ల రూపాయలు పారితోషకం డిమాండ్ చేశారట.

ఇక శివ కార్తికేయన్ కి ఉన్న మార్కెట్ ను బట్టి నిర్మాతలు నో చెప్పలేదని సమాచారం. ఇక ఈ సినిమా గనుక మంచి విజయాన్ని సాధిస్తే శివ కార్తికేయన్ మరింత పారితోషకం డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు అని సినీవర్గాల నుంచి వినికిడి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థకు డిజిటల్ రైట్స్ ను శివ కార్తికేయన్ మాట్లాడి మరీ ఒప్పించారని సమాచారం. అక్టోబర్ నెలలో విడుదలయ్యే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news