టాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు పొందింది శ్రీ రెడ్డి అని చెప్పవచ్చు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల పైన ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వైసిపి పార్టీ పైన ఏదైనా ఆరోపణలు చేస్తే ఈమె అస్సలు సహించదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పాటు ఇతరుల పైన బాగా విరుచుకుపడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కాస్త ఇలాంటివి తగ్గించి యూట్యూబ్లో సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.
ఇక అలా షేర్ చేసిన వీడియో కొద్ది క్షణాల్లోనే చాలా వైరల్ గా మారింది. శ్రీ రెడ్డి చీర కట్టులోని తన పరువాలను చూపిస్తూ కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈమె అందాలను చూస్తూ కొందరు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి ఇటీవల యూట్యూబ్ ని బాగా ఉపయోగించుకుంటుందని చెప్పవచ్చు. అందుకోసం ఆమె పలు రకాల వంటల తో పాటు మధ్యలో ఎక్స్పోజింగ్ చేసి.. తన ఫాలోవర్స్ ని బోర్ కొట్టకుండా చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇక ఇటీవలే శ్రీ రెడ్డి తనకు జరిగిన కొన్ని అన్యాయాల గురించి కూడా తెలియజేస్తూ కన్నీరు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఈమె ఎక్కువగా యూట్యూబ్లో వీడియోలను చేసుకుంటూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది.